భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్ర యంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి.సాక్షాత్తు దేవతా,దేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది .నిత్య దీప ధూప నైవేద్యాలువుంటాయి .శుచీ,ఆచరమూ,శుభ్రతలు అత్యవసరం. స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులు ఉంటాయి.ఏ సమయం లో అలా జరగుతుందో వారికే తెలీదు.అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధీకాలు నిర్వర్తించటం జరిగితే భగవత్ దోషమవుతుంది.మళ్ళి
అనేక శుద్ది క్రియలు చెయ్యాలి.అందుకే ఆ సమయాలలో స్త్రీలు దైవదర్శనం పూజాదికాలు చెయ్యకూడదు.
ఈ సంగతి తెలియని ఆధునిక పోకడలు వున్నమహిళామణులు తమని గుడిలో పూజారులుగా నియమించడం లేదని దేశవ్యాప్తంగా ఆందోళను చెయ్యడం రాజ్యాంగం లో తమకు హక్కు కలిపించ మనడం దేశం అంత తిరిగి తమని తాము ప్రచారం చేసుకోడం పెద్ద ఫ్యాషన్ అయ్యిపోయింది .దానికి తగ్గట్టు ఈ రోజులో దిశ నిర్దేశం, సాంప్రదాయం, పరిపక్వత లేని మన మీడియా,మన న్యాయవ్యవస్థ కూడా అలాంటి వాటికి ఎక్కువ ప్రచారం చేసి మన సంప్రాదాయాలకు గండి కొట్టటం జరగుతోంది.
మొన్నటికి మొన్న శని శoగానాపూర్ లో ఒక్క మహిళ అధ్యక్షురాలిగా నియమితులవ్వడం ,అత్యంత శక్తివంతమైన శబరిమలలో పూజ చెయ్యవచ్చునని కోర్ట్ నుండి ఆర్డర్స్ ని తెచ్చుకొని మరి మన సంప్రదాయాలను భ్రష్టు పట్టించడం ఈ రోజు లో పరిపాటి అయ్యింది. ఒక్కపుడు భారతదేశానికి సాంప్రదాయానికి ,పద్ధతులకు గౌరవం ఇచ్చే ప్రపంచం లోని ఇతర దేశాలకు మనం చులకన అయ్యిపోతున్నాము. ఎంత ఆధునిక మహిళా అయ్యిన ఇతర దేశాలలో వున్న మహిళలు తమ కట్టుబాట్లులను ఎప్పుడు మర్చిపోలేదు అందుకే వాళ్ళు ఎప్పుడు ఇలాంటి వ్యతిరేక చర్యలకు పాటుపడలేదు.
ఏ రోజు ఐతే మనం మన సాంప్రదాయాలకు ,పద్ధతులకు గౌరవం ఇస్తామో అప్పుడు ప్రపంచపటం లో మన దేశ కీర్తి రెపరెపలాడతుంది.
ఇది చదిన తరువాత అయిన మనం మన సాంప్రదాయానికి గౌరవం ఇస్తే మన దేశానికి వున్న విలువలను కాపాడిన వారు అవుతాము.