మునుపు ఏవండి…మీరూ….అల్లుడు గారు ఇలా భార్య,భార్య తరుపువారు భర్తను సంభోదిస్తుండడం సహజం .కాని ఈ రోజులలో ఆడపిల్లలు, వారింటి తరుపువారు వారిని పేర్లతో పిలవడం పరిపాటి అయ్యింది. మనం ఆచరించినా ,ధర్మాలు ,పురాణాలు,ఇతిహాసాల ప్రకారం భర్తను,అల్లుడిని గౌరవంగా,మర్యాద పూర్వకంగా పలకరించడం వారికీ తగిన మర్యాద చెయ్యడం హిందూ సంప్రదాయం.
కాని ఈ మధ్య మనం ఆచారాలు,వ్యవహారాలు అన్ని గాలికి వదిలేసి భర్తను,అల్లుడిని పేరు పెట్టి పిలవడం అలవాటు చేసుకొన్నాం . దీనికి భార్య సంజాయిషీ ఇవ్వడం కోసం : “నాకు ఆయనంటే ఇష్టం కనుక పేరు పెట్టి పిలుస్తాను” అని సమర్దిన్చుకుంటుంది.ఇంకా భార్య తరుపు వారు ఏమంటారు అంటే “నా కొడుకు అయిన అల్లుడైన అతనే కాబ్బట్టి పేరు పెట్టి పిలవడం లో తప్పు లేదు” అని వారి భావన.
దీని వలన బయటవారికి భర్త మిద ఉండవలసిన గౌరవం,మర్యాద రెండు ఉండవు సరి కదా ఒక్కింత అతను పలచన అవ్వడమే కాకుండా మీరు అపహాస్యం పాలు అవుతారు. దయచేసి అందరిని వేడుకుంటోంది ఏంటంటే కనీసం ఈ పోస్ట్ చదివిన తరువాత అయిన మన భారతీయ సంప్రదాయాలను పాటిద్దాం.